మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 14 :భారతరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్ని నెల్లూరు నగరం నడిబొడ్డులో ఉన్న వి ఆర్ కళాశాల కూడలి నందు 10 ఆంధ్ర నేవల్ యూనిటీ ఎన్సిసి లెఫ్ట్నెంట్ కమాండర్ మరియు కమాండింగ్ ఆఫీసర్ గణేష్ గొదంగవే ఆదేశాల మేరకు కే.ఎన్.ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల భక్తవత్సల నగర్ నెల్లూరు నందు పనిచేస్తున్న సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వారికి ఘనంగా నివాళులు అర్పించి గుండాల నరేంద్ర బాబు మాట్లాడుతూ......డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక సామాన్య అతి నిరుపేద కుటుంబంలో పుట్టి అనేక అవమానాలు, హేళనలు, వివక్షలు ఎదుర్కొని వాటన్నిటిని అధిగమించి అనేక ఉన్నత విద్యలను అభ్యసించి సామాన్య స్థాయి నుంచి అసమాన్య స్థాయికి ఎదిగి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సమ సమాజ స్థాపనకు సమన్యాయానికి అంటరానితనము నిర్మూలనకు అహర్నిశలు తన జీవితాంతం పాటుపడిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అంబేద్కర్ కేవలము ఏ వర్గానికి చెందిన నాయకుడు కాదని ఆయన జాతీయ నాయకుడని మహనీయులకు కులమత ప్రసక్తి ఉండదని ఆయన అందరికి చెందిన వారని భారత దేశ మొదటి న్యాయ శాఖమంత్రి అని, భారత రాజ్యాంగ రచనలో రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు అవిశ్రాంత కృషి చేసి నవ భారత రాజ్యాంగాన్ని స్వేచ్ఛ,సమానత్వం, సౌబ్రాతృత్వం, సమన్యాయం ప్రాతిపదికగా అందించారని దాని మధుర ఫలాలు మనందరం నేడు అనుభవిస్తున్నామనిఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి మహాత్మ జ్యోతిబాపూలే, గౌతమ బుద్ధుడు, కబీరు ఆదర్శమని వారి బాటలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఈ దేశానికి ఎన్నో అత్యుత్తమ సేవలు అందించారని, సమయాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చక్కగా సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదిగారని నేటి యువత సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మార్గంలో పయనించాలని వారు ఈ దేశానికి చేసినటువంటి విశిష్ట సేవలను కొనియాడుతూ వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువతరం ముందుకు సాగాలని విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత విద్యలు అభ్యసించాలని ఈ లోకంలో తరగని చెరగని ఆస్తి చదువు మాత్రమేనని అటువంటి ఉన్నత చదువులను నేటి తరం విద్యార్థులు వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని మనకోసం చేసుకున్నది మనతోనే అంతరించిపోతుందని ప్రజల కొరకు చేసింది శాశ్వతంగా నిలిచిపోతుందని మన కోసం జీవించక ప్రజల కోసం జీవించాలని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మనందరి కోసం చేసిన నిరుపమాన త్యాగాలను దేశం యావత్తు ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని సమ సమాజ నిర్మాణంలో యువత తన వంతు పాత్రను పోషించాలని వారి ఆశయ సాధనలో సామాజిక బాధ్యతతో నేటి యువత ముందుకు సాగాలని ఈసందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కెఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల ఎన్సిసి నేవల్ క్యాడేట్లు విరివిగా పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘనంగా నివాళులు అర్పించారు. వారి ఆశయ సాధనలో ముందుకు సాగుతామని ప్రతిన బూనారు.