మనన్యూస్,సింగరాయకొండ:రిపోర్టర్భారత రాజ్యాంగ నిర్మాత డా"బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి సర్కిల్ ఆఫీస్ సింగరాయకొండ నందు ఘన నివాళులు అర్పించిన సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ సిహెచ్ హాజరత్తయ్య గారు మరియు సిబ్బంది.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సీఐ గారు మాట్లాడుతూ భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుంది. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ గారి కృషి అమోఘం. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానం. అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారు.పేదింటిలో పుట్టి స్వయం కృషితో ఎదిగి, జీవితాంతం బడుగు, బలహీన వర్గాల ప్రజల పక్షాన నిలిచిన అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని, అనుసరణీయమని సీఐ గారు పేర్కొన్నారు.అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, స్వేచ్చగా ఆత్మగౌరవంతో బతకడం అలవర్చుకోవాలని ఈ సందర్బంగా ఆయన పిలుపునిచ్చారు.మంచి నడవడిక, విద్య, ఆర్థిక స్వావలంభన ఆత్మగౌరవానికి పునాదులు అని పేర్కొన్నారు.