మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్
పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవులపై వైసిపి విష రాజకీయానికి తెరలేపి రాక్షస ఆనందం పొందుతూ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కుట్రకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ రాజా ఆదేశాల మేరకు టిడిపి శ్రేణులు మీడియా సమావేశంలో పైరయ్యారు.ఈ సందర్భంగా శంఖవరం మండల టిడిపి అధ్యక్షుడు బద్ది రామారావు,రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్నా ఈశ్వరుడు (శివ) మాట్లాడుతూ టీటీడీ గోవులు మరణించాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి అసత్య ప్రచారంపై మండిపడ్డారు.వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.అలజడి సృష్టించేందుకు,ప్రశాంతతకు భంగం కలిగించేందుకు టీటీడీపై రోజుకో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కోటిమంది దేవతలతో సమానంగా భావించే గోమాతలపై కూడా అసత్య ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం అన్నారు.గోశాలలో 100 ఆవులు చనిపోయాయంటూ నేడు కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తమన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీబీన్ ఆర్మీ అధ్యక్షులు యాళ్ల జగదీష్,ఏలేశ్వరం మండల పార్టీ అధ్యక్షుడు సూతి అప్పలరాజు,కాకినాడ పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొమ్ముల కన్నబాబు, ఉత్తరకంచి సర్పంచ్ మంతెన వెంకట రమణ,బద్ది వెంకటరమణ, బద్ది రామకృష్ణ,సుబ్బారారెడ్డి సాగర్ చైర్మన్ ఇళ్ల అప్పారావు,నాయకులు బొల్లు కొండబాబు,మదినే దొరబాబు,పోలిశెట్టి శ్రీనివాస్,బొల్లు చిన్నోడు తదితరులు పాల్గొన్నారు.