మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.హైదరాబాద్ లోని
ఎర్రమంజిల్ లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధ్యక్షత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ..
జుక్కల్ నియోజకవర్గంలోని లెండి,నాగమడుగు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి కోరారు కౌలాస్ నాలా మరమ్మత్తులు,సింగితం రిజర్వాయర్ రిటర్నింగ్ వాల్, పెద్ద ఎడిగి కాల్వ మరమ్మత్తులు,బిచ్కుంద కమ్మరి చెరువు మరమ్మత్తు
లు చేయాలని అలాగే నియోజకవర్గంలోని చిన్న చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రికి విన్నపించారు.మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ,తదితరులు ఉన్నారు.