ఏలేశ్వరం ,మన న్యూస్ :-అసెంబ్లీ సమావేశాల రెండవ రోజు కూడా నియోజకవర్గ సమస్యలపై ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తన గళం వినిపించారు.ముఖ్యంగా గిరిజన గ్రామాల ప్రజల సమస్యలపై ఆమె మాట్లాడారు. గిరిజన గ్రామాలకు రోడ్లకు నిధులను మంజూరు చేసినా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి మంజూరు కానందున రోడ్ల నిర్మాణం ఆగిపోతుందని,అటవీ శాఖ మంత్రి చొరవ తీసుకుని అనుమతి త్వరితగతన ఇప్పించి రోడ్ల నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని,గిరిజనులకు మెరుగైన విద్య,వైద్యము అందించాలని, గిరిజన గ్రామాలన్నింటినీ ఐటీడీఏ పరిధిలో ఉంచాలని కోరుతున్నానని ఆమె అన్నారు.నియోజకవర్గంలో ఏలేశ్వరం- జడ్డంగి అన్నవరం గ్రామాల మధ్య ఉన్న రహదారి పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలోని కూడా ఈ రహదారిని పట్టించుకున్న పాపాన పోలేదని దాదాపుగా 53 గిరిజన గ్రామాలకు ప్రయాణం చేయాలంటే ఈ రహదారి పైనే వెళ్లాలని,పెద్ద పెద్ద గుంతలతో ఉన్న ఈ రహదారిపై అనేక ప్రమాదాలు జరిగి గాయాల పాలవడం,ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటన కూడా జరిగాయని ఆమె అన్నారు. అలాగే వివిధ గ్రామాల్లోని రోడ్ల పరిస్థితులపై కూడా ఆమె వివరించారు.