మనన్యూస్,నారాయణ పేట:ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకు పోవాలని మక్తల్ మాజీ శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు ఈనెల 27న వరంగల్లో జరిగే బిఆర్ఎస్ రజితతో ఉత్సవాల ను పురస్కరించుకొని ఆదివారం వారి నివాసంలో నిర్వహించిన నియోజకవర్గం స్థాయి సనహాక సమావేశంలో ఆయన మాట్లాడారు.బిఆర్ఎస్ పార్టీ ప్రజా సభకు ప్రతి పల్లె నుంచి భారీగా తరలి రావాల్సిందిగా ఆయన పార్టీ నాయకులను కార్యకర్తలను కోరారు. బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించి నా పార్టీ అని అన్నారు. పదేళ్లలో కేసీఆర్ పాలనలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకపోగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా మాయమాటలు చెప్పి తప్పించుకోవాలని చూస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను అధికారులను గ్రామాలలో ఎక్కడికక్కడ నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వ హాయంలో అవినీతికి అదుపు లేకుండా పోయిందని ఎవరికి దొరికినంత వాళ్లు దోచుకోవడం జరుగుతుందని ఆయన విమర్శించారు. ఒకవైపు నియోజకవర్గంలో పంటలు ఎండిపోయి రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆయన అన్నారు.రైతుల పొలాలు చేతికొచ్చినవి ఎండిపోవడం వలన రైతులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక ఇబ్బందుల పాలవుతున్నారని తెలిపారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చిన రైతుల ఆత్మహత్యలు యువత ఉపాధి లేక ఇబ్బందులు కరువు కాటకాలతో బాధపడడం జరుగుతుంది అని,గతంలో ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ పునరావతం కావడం తెలంగాణ ప్రజల దురదృష్టకరమని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలను ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకునేంతవరకు ప్రతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త వీరిని ఎక్కడెక్కడ నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు పి నరసింహ గౌడ్,కే రాజేష్ గౌడ్, రాజేందర్ సింగ్, ఎస్సే రాజు, మాజీ జెడ్పిటిసిలు, అశోక్ కుమార్ గౌడ్,అరవిందు, మాజీ ఎంపీపీ జయరాములు,సింగిల్ విండో అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఏ మహిపాల్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, రమేష్,రవికుమార్ యాదవ్, లక్ష్మారెడ్డి, ఎల్లారెడ్డి,శివరాజ్, పటేల్ మక్తల్ పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చిన్న హనుమంతు, పార్టీ మాజీ సర్పంచులు ప్రతాపరెడ్డి, కొత్త కాపు గోవర్ధన్ రెడ్డి,సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సాయిలు గౌడు, అన్వర్ హుస్సేన్, జగ్గలి రాములు శివారెడ్డి కొత్త గార్లపల్లి నరసింహారెడ్డి గాలి రెడ్డి అమ్రేషు పేట నరసింహులు,శేఖర్ రెడ్డి తరులు పాల్గొన్నారు.