మనన్యూస్,సింగరాయకొండ:పాకల గ్రామంలోని అంబేద్కర్ నగర్లో నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ మరియు మహిళల పొదుపు సంఘాల కోసం నిర్మించిన భవనాన్ని నిన్న శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గౌరవ డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సౌకర్యాల మెరుగుదల ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అలాగే మహిళల ఆర్థిక సాధికారత కోసం పొదుపు సంఘాలు కీలకంగా మారాయని, వాటికి మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు స్పష్టంగా పేర్కొన్నారు.గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు