రామకృష్ణ గోంతునులిమి దాడి చేసి హతమార్చిన ట్రాన్స్ జెండర్స్ రామకృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని జిల్లా ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన
మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా మల్డకల్ మండలకేంద్రంలోనికి చెందిన రామకృష్ణ 25,సం.అనే యువకుడు నాతో కలిసి తిరగడం లేదునే నెపంతో. ఈ మధ్యకాలంలో ఫోన్ మాట్లాడడం లేదని గద్వాలకు చెందిన ట్రాన్స్ జెండర్ శివ ,శివాణి తో పాటు మరో ముగ్గురు ట్రాన్స్ జెండర్స్ కలిసి మల్డకల్ గ్రామానికి చెందిన రామకృష్ణ అనే యువకుడి ఇంట్లోకి ప్రవేశించి ఇంటిలోపల తలుపులు వేసి ఆ యువకుడిని నోట్లో బట్టపెట్టి గొంతు నులిమి విచక్షణ రహితంగా దాడి చేయగా అవస్మారక సీతిలోకి వెళ్లిపోవడంతో గమనించిన ట్రాన్స్ జెండర్స్ నలుగురు కలిసి ఓ వాహనం లో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యులకు చూయించగా రామకృష్ణ మృతి చెందాడని వైద్యులు చెప్పడంతో అక్కడినుంచి ట్రాన్స్ జెండర్స్ పారిపోవడం జరిగిందని బంధువులు ఆరోపణ.రామకృష్ణ కూడా సోదరి వివాహానికి కుటుంబ సభ్యులు అందరూ వెళ్లడంతో వారితో పాటు రామకృష్ణ కూడా వివాహానికి బయల్దేరే సమయంలో ఈ ఘటన జరిగింది బంధువుల ఆరోపణ.ప్రస్తుతం ట్రాన్స్ జెండర్ శివణీ వారి అమ్మను పోలీసుల అధీనంలో ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన రామకృష్ణ కు 4సం.క్రితం ప్రేమ వివాహం కాగా ప్రస్తుతం ఆయనకు భార్య ముగ్గురు కూతుర్లు ఉన్నారు. మృతి చెందిన రామకృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు బంధువులతో ఆందోళన చేపట్టారు