100 కు డయల్ చేసినా, నాకు ప్రాణహాని ఉంది న్యాయం చేయండి.
బాధితుడు రాయుడు ఆవేదన..
మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా కె.టి. దొడ్డి: మండలంలోని మా ఇంటి ముందునుంచి బాత్రూం వెళ్లడానికి తిరగవద్దు అనే నెపంతో ఓ వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తీవ్రంగా దాడి చేసే గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పూర్తి వివరాల్లోకెళ్తే..కేటీ.దొడ్డి మండలంలోని ఈర్లబండ గ్రామానికి చెందిన
మద్దెల వెంకటన్న,మద్దెల వీరన్న,మద్దెల రంగన్న, మద్దెల నాగరాజు, మద్దెల మాణిక్యమ్మ అనే వ్యక్తులు కలిసి మా ఇంటి ముందు నుంచి బాత్ రూమ్ వెళ్లడానికి వీళ్లేదని, మీరు వెళ్ళితే మా ఇంటిముందు బురద అంటుతుందని అదే గ్రామానికి చెందిన రాయుడు అనే వ్యక్తిని తీవ్రంగా ముకుమ్మడిగా కట్టెలు,రాళ్లతో అకారణంగా దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితుడు రాయుడు తెలిపారు.