కావలిఎమ్మెల్యే దగు మాటి వెంకటకృష్ణారెడ్డి సమక్షంలో టిడిపి పార్టీలో చేరిన ఇతర పార్టీ నాయకులు. మన న్యూస్,కావలి,ఏప్రిల్ 12:*కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే.అభివృద్ధి ఎజెండా అందరం కలిసికట్టుగా పని చేద్దామంటున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి.నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు.ఇంటింటికి ఎమ్మెల్యే సమస్య మీది పరిష్కారం నాది అనే నినాదంతో అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి. శనివారంకావలి వెంగళరావు నగర్ 25వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం 25వ వార్డులో అత్యంత ఘనంగా జరిగింది.వార్డులోని ప్రతి నివాసానికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకొని వారికి నేనున్నానంటూ భరోసా కల్పించారు.కూటమి ప్రభుత్వం కావలిలో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీ నాయకులు ఆకర్షితులవుతున్నారన్నారు. నేడు దేవిరెడ్డి ఆదిరెడ్డి,పొలిమేరి మస్తాన్ రెడ్డి దంపతులు,దిండు శ్రీనయ్య,ముత్తు జగదీశ్ రెడ్డి, మరి కొంతమందికి కండువా కప్పి టిడిపి పార్టీలోకి ఆహ్వానించారు.అందరం కలసి మెలసి తారతమ్యము లేకుండా తెలుగుదేశం పార్టీని బలోపేతానికి కృషి చేయాలని ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అందరికీ అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.