మన న్యూస్, కావలి, ఏప్రిల్ 12:ఇంటి వద్దే సమస్యలను పరిష్కరిస్తున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి.అధికారులతో కలిసి శనివారం ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి.కావలి వెంగళరావు నగర్ 25వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం.25వ వార్డులో టిడిపి పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే. ఎమ్మెల్యేకి బ్రహ్మరథం పడుతున్న వార్డు ప్రజలు.నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.వార్డులోని ప్రతి నివాసానికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి.తమ సమస్యలను అర్జీల రూపంలో ఇవ్వాలని స్థానికులకు సూచించిన ఎమ్మెల్యే.ఆర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి వెంటనే పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.కొన్ని సమస్యలను స్పాట్లోనే పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి.ప్రతి వార్డులోనూ ఇకపై ఇంటింటికి తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకోనున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి.కావలిని కాపుకాస్త అనే మాటకి కట్టుబడి ప్రజల వద్దకే వెళ్లి వారి బాగోగులు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే.