సింగరాయకొండ మన న్యూస్:- సమాజసేవకుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు జ్యోతిరావు ఫూలే గారి జయంతిని పురస్కరించుకుని సింగరాయకొండలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కొండేపి నియోజకవర్గ వైయస్సార్సీపీ ఇంచార్జి, పిఏసి సభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు డా. ఆదిమూలపు సురేష్ ఆదేశాల మేరకు స్థానిక క్యాంప్ ఆఫీస్లో ఈ వేడుకలు మండల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు పాల్గొన్నారు.