సింగరాయకొండ మన న్యూస్:- సింగరాయకొండ గ్రామ ఉప సర్పంచ్ పదవిలో ఉన్న షేక్ కరిమూన్ గారు ఆరోగ్య సమస్యల కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. మండల అభివృద్ధి అధికారి ( ఈవో పి ఆర్ డి) కు అందించిన రాజీనామా లేఖలో, వైద్య కారణాల నేపథ్యంలో తన బాధ్యతల నిర్వర్తనలో ఆటంకం కలగకుండా ఉండేందుకు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.