మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామంలో నూతనంగా సీసీ రోడ్లు నిర్మాణ పనులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు భూమా గౌడ్ కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, నిజాంసాగర్ మాజీ జడ్పిటిసి జయ ప్రదీప్ ల కృషితోనే ఎన్ఆర్ఈజీఎస్ పధకంలో భాగంగా 5 లక్షల రూపాయలు సిసి రోడ్లకు మంజూరు చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో దర్జీ రాములు, భూమయ్య,రాజేందర్,రాజు, అంజయ్య,రామకృష్ణ,తదితరులు ఉన్నారు.