మన న్యూస్,నెల్లూరు, ఏప్రిల్ 11 : నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సామాజిక సంస్కర్త, బీసీల ఆరాధ్య దైవం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని పూలే చిత్రపటానికి వైఎస్ఆర్సిపి జిల్లా బీసీ నాయకులతో కలిసి శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నివాళులర్పించారు.ఈ సందర్బంగా బీసీల అభ్యున్నతికి, మహిళా విద్యావ్యాప్తికి పూలే చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.ఈ సందర్బంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.........వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి.. జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు.పూలే చేసిన కృషి ఫలితంగా.. ఈరోజు సమాజంలో బీసీ వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరూ.. స్వేచ్ఛ, సమానత్వంతో అన్ని హక్కులు పొందుతూ.. సమాజంలో ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. అదే స్ఫూర్తితో .. వైయస్ జగన్మోహన్ రెడ్డి నా ఎస్టీ, ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని వారందరినీ ముందుకు తీసుకురావాలని ఆలోచనతో.. అనేక సంక్షేమ ఫలాలు అందించిన విషయం మనందరికీ తెలిసిందేనన్నారు.ఇదే వరవడితో భవిష్యత్తులో.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారధ్యంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా.. మరింత మెరుగ్గా.. బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.