నెల్లూరు,మన న్యూస్,ఏప్రిల్ 10 :కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, డీఆర్వో ఉదయ భాస్కర్, ఆర్డీఓ నాగ అనూష, జెడ్పీ సీఈఓ విద్యాధరితో కలసి సమీక్ష.నెల్లూరు కలెక్టరేట్ లో తిక్కన భవన్ లో గురువారం నిర్వహించిన సమీక్షకు హాజరైన ఐదు మండలాలకు సంసబంధించిన అన్ని శాఖల అధికారులు.ఎమ్మెల్యేతో పాటు అధికారుల లాగిన్లలో 6475 అర్జీల నమోదు చేశారు.ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని మండల అధికారులకు సూచనలు చేశారు.ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు పొందడంతో పాటు అర్హత కలిగిన పేదలందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేలా చర్యలు తీసుకోవాలని మండల అధికారులకు సూచనలు చేశారు.గిరిజనులందరికీ ఆధార్ కార్డుల నమోదుకు సంబంధించి చేపట్టిన చర్యలపై ఆరా తీశారు.ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా సబ్సిడీపై అందరి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేలా ప్రజలందరినీ ప్రోత్సహించాలని నిర్ణయం.