మన న్యూస్, కావలి,ఏప్రిల్ 10:విద్యార్థులు తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు, చదువుకున్న పాఠశాలకు కీర్తిప్రతిష్టలు తీసుకువచ్చేలా అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు. కావలి పట్టణం గాయత్రి నగర్ లోని నలంద పాఠశాలలో గురువారం 35వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు పై శ్రద్ధ పెట్టి ఇష్టంగా చదువుకోవాలని తెలిపారు. విద్యార్థి దశలో కష్టపడితే, తదుపరి జీవితం సుఖమయం అవుతుందని తెలిపారు. ఎంతమంది స్నేహితులు ఉన్నా సరే, ఒక మంచి మిత్రుడిని సంపాదించుకోవాలని తెలిపారు. విద్య ఆవశ్యకత, గురువుల గొప్పతనాన్ని ఆయన వివరించారు.విద్యార్థులకు ఆశీస్సులను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే తిలకించారు. పాఠశాల యాజమాన్యం ఎమ్మెల్యే ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ మజహర్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు..