సింగరాయకొండ రిపోర్టర్ 11-04-2025 స్వర్ణ సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వివిధ రంగాల్లో సేవ లు అందించిన వారికి ఈ అవార్డు ప్రధానం చేస్తారు. బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, బాండెడ్ చైల్డ్ లేబర్స్, చైల్డ్ లేబర్, అలాంటి కార్యక్రమాల్లో విశేష కృషి వాటి నిర్మూలనకు తమ వంతు కృషిచేసి ప్రజల్లో మంచి అవగాహన కల్పించినందుకు గాను ప్రకాశం జిల్లా సింగరాయకొండ స్వచ్ఛంద సేవా సంస్థ సాంత్వనా సేవా సమితి డైరెక్టర్ రావినూతల జయకుమార్ కి ఈ అవార్డుని ఈనెల 14వ తేదీ రాజమండ్రిలో జరిగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగ ప్రధానం చేస్తున్నట్లు స్వర్ణ సోషల్ సర్వీసెస్ ఫౌండర్ అండ్ చైర్మన్ డా. లక్ష్మీ తెలిపారు.