మన న్యూస్, నారాయణ పేట:కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లి బావాజీ జాతర, గిరిజనుల ఆధ్యాత్మిక గురువు శ్రీ లోక మాసందు దేవాలయం జాతర 11, 12,13,14 తేదీలలో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 150 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని కోస్గి సీ ఐ సైదులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం జాతర బందోబస్తుకొచ్చిన పోలీస్ అధికారులు సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ,జాతరకు వచ్చే ప్రజలకు, భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ పాయింట్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరుగుతుందని, వాహనాల కొరకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జాతరకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. తెల్లవారుజామున రథోత్సవం జరిగే సమయంలో భక్తులకు ఇబ్బంది లేకుండా బారికేట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, రథం చుట్టూ రోప్ పార్టీలతో పోలీసు బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జాతరలో పోలీస్ పీకెట్స్, ఫుట్ పెట్రోలింగ్, దొంగతనాలు, దోపిడీలు జరగకుండా మఫ్టీలో పోలీసులు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. జాతరలో మహిళల, అమ్మాయిలను రక్షణ కొరకు షి టీమ్ పోలీసులతో నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని, జాతరలో ప్రత్యేక పోలీస్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగిందని జాతరకు వచ్చే భక్తులు చిన్నపిల్లలు ముసలి వాళ్లు ఎవరైనా తప్పిపోయిన పోలీస్ కంట్రోల్ రూమ్ లో లేదా దగ్గర్లోని పోలీసులకు తెలియజేయాలని కోరారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 కి కాల్ చేసి సమాచారమ్ ఇవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్, బందోబస్తుకొచ్చిన పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.