ఎల్బీనగర్. మన న్యూస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండలం తెలంగాణ ప్రధాన జాతీయ రహదారి 65కూ అనుసంధానంగా ఉన్నటువంటి సర్వీసు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జెఏంఆర్ ఫిలింగ్ స్టేషన్ ను ప్రముఖులు హాజరై గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిలతో కలిసి భువనగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ క్యామ మల్లేష్ కురుమ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, యజమానులు జక్కిడి మల్లారెడ్డి, జక్కిడి రఘువీర్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు.