మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మొహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి,తహసీల్దార్ సవైయిసింగ్ లు కలిసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు.ఐకేపీ ఏపిఎం రామ్ నారాయణ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సాదుల సత్యనారాయణ, మాజీ సిడిసి చైర్మన్ గంగారెడ్డి,
సీసీ విఠల్,నాయకులు నాగభూషణ్ గౌడ్,ఖాలీక్,రైతులు తదితరులు ఉన్నారు