మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్; ఏప్రిల్ 11: దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో
మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా బద్వేల్ పట్టణం లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిoచిన దళిత హక్కుల పోరాట సమితి కడప జిల్లా అధ్యక్షులు నాగ దాసరి ఇమ్మానుయేలు కార్యనిర్వాహక కార్యదర్శి పడిగే వెంకటరమణ మాట్లాడుతూ.. స్త్రీ విద్యా ప్రదాత బడుగు బలహీన వర్గాలు, శూద్రులకు దేశంలో మహోన్నత స్థానాల కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు పూలే అని వారు కొనియాడారు. దేశంలోని అంటరానితనానికి వ్యతిరేకంగా మరియు స్త్రీలకు విద్య కోసం తన జీవితాంతం పాటుపడిన మహాత్ముడని ఆయన జయంతి సందర్భంగా దేశంలోని ప్రభుత్వాలు పూలే దంపతులకు భారతరత్న బిరుదుచ్చి ఆయనను గౌరవించాలని వారు కోరారు. జ్యోతిరావు పూలే దంపతుల ఆశయ సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములై దేశాభివృద్ధికి పాటు పడాలన్నారు.ఈ కార్యక్రమంలో
బద్వేల్ మండల డి హెచ్ పి ఎస్ నాయకులు
సుధాకర్ ,రాజశేఖర్, బ్రహ్మయ్య, వెంకటేష్, వీరయ్య, హరి, టైటానికస్, ప్రసాద్, రామకృష్ణ, శ్రీపతి, శివ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.