పినపాక, నవంబర్, 14, 2024, మన న్యూస్ పినపాక జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రధానోపాధ్యాయులు రమణ బాలల దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఈ బాలల దినోత్సవం జరుపుకుంటామని నేటి బాలలే రేపటి పౌరులు అని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అనంతరం నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయ లాగా మారి పాటలు చెప్పారు. ఈ సందర్భంగా ఆటలు, డాన్స్, పాటల పోటీలు నిర్వహించడం జరిగింది అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. వైస్ ప్రిన్సిపాల్ రామ్ల్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల చదువుపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.