మన న్యూస్, ఎస్ఆర్ పురం :- గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో యువతకు అండగా ఉంటా గ్రామీణ క్రీడలు ప్రోత్సహిస్తా అని ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తనయుడు డాక్టర్ రాహుల్ అన్నారు. గురువారం ఎస్ఆర్ పురం మండలం పెద్ద తయ్యూరు క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ రాహుల్ పాల్గొన్నారు.. గురువారం చివరి రోజు బుకాపట్నం, ఉత్తరపు కండ్రిగ జట్టు మధ్య హోరాహోరీగా జరిగింది ఈ మ్యాచ్లో ఉత్తరపు కండ్రిగ గెలుపొందగా బుక్కాపట్నం రన్నర్స్ గా నిలిచారు.గెలుపొందిన జట్టుకు జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ తనయుడు డాక్టర్ రాహుల్ మొదటి బహుమతి 50,000 రూపాయల నగదును కప్పు ను ప్రధానం చేసి క్రీడాకారులకు అభినందించారు. ఆయన మాట్లాడుతూ క్రికెట్ ఆటల్లో గెలుపు ఓటమి సహజం అందరూ కలిసి కలిసి ఉత్సాహంగా ఆట పోటీల్లో పాల్గొనాలని అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో మినీ స్టేడియం త్వరలో ఏర్పాటు చేసి యువతకు అండగా ఉంటాం అని డాక్టర్ రాహుల్ అన్నారు. క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు మొదటి ప్రైజ్ 50 వేల రూపాయలు బహుకరించిన టిడిపి యువ నాయకుడు సాఫ్ట్వేర్ బాలు ను డాక్టర్ రాహుల్ అభినందించారు.. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ బాబు ,ఎమ్మెల్యే డాక్టర్ థామస్ వ్యక్తిగత సలహాదారుడు చంద్రశేఖర్, క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ చిరంజీవి ,నరేష్, రాజకుమార్, టిడిపి నాయకులు, యువకులు పాల్గొన్నారు.