బాటసింగారం. మన న్యూస్ :- మామిడి సీజన్ నేపథ్యంలో బాటసింగారం పండ్ల మార్కెట్ లో జరుగుతున్న మామిడి పండ్ల క్రయ విక్రయాలను పరిశీలించిన గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి పాలకవర్గం..అధికారులు. మార్కెట్ కి వచ్చే మామిడి రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం..రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం.గిట్టుబాటు ధర అందించడం లో ముందుంటాం. చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి.మామిడి పండ్ల సీజన్ నేపథ్యంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని బాటసింగారం పండ్ల మార్కెట్ లో గురువారం ఉదయం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గం మరియు అధికారులు మామిడి యార్డు మొత్తం తిరిగి సమస్యలను క్రయ విక్రయాలను అడిగి తెలుసుకున్నారు…మార్కెట్ కి వచ్చిన రైతుల సమస్యలను తెలుసుకొని వారి సలహాలను స్వీకరించడం జరిగింది.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ…గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మామిడి దిగుబడి అధికంగా ఉన్నదని,మార్కెట్ కి వచ్చే రైతులకు అన్ని రకాల సదుపాయాలు కలిపిస్తున్నామని చెప్పారు..రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యమని అన్నారు.రైతులకు మంచి గిట్టుబాటు అందించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు..రోజుకు 800 వాహనాలు మార్కెట్ కి వస్తున్న తరుణంలో ట్రాఫిక్ కి ఇబ్బంది కలగాకుండా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ Ch,బాస్కర చారి…పాలకవర్గం సభ్యులు బండి మధుసూదన్ రావు…దోమలపల్లి అంజయ్య…నవరాజ్….మెగావత్ గణేష్ నాయక్…రఘుపతి రెడ్డి…మేకం లక్ష్మి…గోవర్ధన్ రెడ్డి… మచ్చెందర్ రెడ్డి…నరసింహ….ఎండీ ఇబ్రహీం తో పాటు మార్కెట్ కార్యదర్శి L,శ్రీనివాస్…హర్ష…విజయ్…మురళి…శ్రీను…శ్రీశైలం తో పాటు తదితరులు పాల్గొన్నారు.