సింగరాయకొండ మన న్యూస్ 10-04-2025 :- ఈరోజు మరియు రేపు పాత సింగరాయకొండ పంచాయితీ పరిధిలో అయ్యప్ప నగర్ సచివాలయ కార్యాలయం నందు ఆధార్ క్యాంపు స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడుతుంది. ఈ క్యాంపు నందు 0-6 సంవత్సరాల వయసుగల చిన్నారులకు నూతనంగా ఆధార్ కార్డు తీయడం మరియు బయోమెట్రిక్ అప్డేట్స్ చేయడం జరుగుతుందన్నారు . రానున్న విద్యా పాఠశాలలో ప్రవేశానికి ఆధార్ కార్డు తప్పనిసరి కనుక ఆధార్ కార్డు లేని చిన్నారులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరని న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా తెలియజేశారు.