మన న్యూస్ : పొదలపల్లి గ్రామంలో కార్వేటినగరం సిఐ హనుమంతప్ప ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ హనుమతప్ప మాట్లాడుతూ ఎస్ఆర్ పురం మండలం పొదలపల్లి గ్రామంలో శుక్రవారం గార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని అందులో భారీ ఎత్తున 2000 లీటర్ల నాటు సారా ఊట, నూరు లీటర్ల నాటు సారా 28 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగిందని అన్నారు అదేవిధంగా 7 మంది అనుమానితులు ఉన్నట్లు వారిని విచారించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా నాటు సారా తయారుచేసిన అమ్మిన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ పురం ఎస్సై సుమన్ కార్వేటినగరం ఎస్సై రాజ్ కుమార్ వెదురుకుప్పం ఎస్సై వెంకటసుబ్బయ్య, 30 మంది పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.