మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 10 : బద్వేల్ పట్టణంలో కూరగాయల మార్కెట్ దగ్గర బలిజ సేవ చలివేంద్ర కార్యక్రమంలో మజ్జిగ వితరణ జరిగింది. ఈ మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని వరికూటి నాగరాజు సహాయ సహకారంతో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి కొమ్మిశెట్టి చిన్ని సుబ్బన్న(EX. Mptc), మరియు రామాయణపు రామసుబ్బయ్య చేతుల మీదుగా బలిజ సేవ సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకటసుబ్బయ్య, ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బలిజ సేవా సంఘం కార్యదర్శి కొంకుల వెంకటరమణ, ఉపాధ్యక్షులు కొర్రపాటి సురేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ బాల నరసింహులు, కూరగాయల మార్కెట్ అధ్యక్షులు ధర్మిశెట్టి అశోక్ రాయల్, మువ్వ నరసింహులు, అడ్వకేట్ పండుగాయల రమణయ్య, పెద్ది సుధా, శోభ భాష, కాయల శ్రీనివాసులు, సింగంశెట్టి రమణ, తోట రాము గోగు రామయ్య ,పండుగాయల శీను, అగ్రహారం బాలచంద్రుడు, నరేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.