మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మొహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు హోరా హోరీగా జరిగాయి. ఉదయం మొదలుకున్న కుస్తీ పోటీలు 50,100,500,1000, వరకు కొనసాగాయి.కుస్తీ పోటీలను తిలకించేందుకు మహారాష్ట్ర,కర్ణాటక, నారాయణఖేడ్,జహీరాబాద్, నిజాంపేట్,తదితర ప్రాంతాల నుంచి మరలయోధులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.కుస్తీ పోటీల్లో గెలుపొందిన విజేతకు గ్రామ పెద్దలు శ్రీధర్ రెడ్డి,కలకొండ నారాయణ,పున్న నారాయణ లు నగదును అందజేశారు.ఆఖరి కుస్తీ 2100 వరకు కొనసాగినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు విఠల్,రపీ,రమేష్, వెంకట్ రామ్ రెడ్డి,తదితరులు ఉన్నారు