మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 9: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 11 అన్ని జిల్లాల కలెక్టరేట్ దగ్గర సమగ్ర కులగణన జరపాలని, అందులో భాగంగా కడప కలెక్టరేట్ దగ్గర జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బుధవారం BSP పార్టీ గోడ పత్రాలు బద్వేల్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆవిష్కరణ చేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మరియు కడప జిల్లా కలెక్టరేట్ దగ్గర జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ రమణ, బీఎస్పీ పార్టీ బద్వేల్ నియోజకవర్గం అధ్యక్షులు మున్నా, ముండ్లపాటి బుచ్చయ్య, కూకట్లపల్లి మురళి, ప్రజా సంఘం నాయకులు పాల్గొన్నారు.