మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్9: బద్వేలు పట్టణం లోని సి.ఆర్. నగర్ లో స్వాతంత్ర సమరయోధులు కమ్యూనిస్టు దిగ్గజం చండ్ర రాజేశ్వరరావు వర్ధంతి సభ జరిగింది. బుధవారం ఈ సభను ఉద్దేశించి భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా కార్యవర్గ సభ్యులు వి. వీరశేఖర్ మాట్లాడుతూ ధనికుడు జమీందారు కుటుంబానికి చెందిన ఈయన తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఫణంగా పెట్టి పేద. బడుగు.బలహీన. వర్గాల ప్రయోజనాల కోసం తన యొక్క సొంత ఆస్తులను సైతం ప్రజలకు పంచిపెట్టి నికార్సైన కమ్యూనిస్టు జీవితం గడపారని ఆయన కొనియాడారు.పెత్తందారి విధానం కు వ్యతిరేకంగా వ్యవసాయ కూలీలు అందరినీ ఏకం చేసి ఇల్లు.భూమి. లేని పేదలను ఐక్యపరిచి భూ పోరాటాలు నిర్వహించి ఆద్యుడు అయ్యారని తెలిపారు తెలిపారు తెలిపారు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దలపల్లి బాలు. జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ. నల్లిపోగు నాగేశం. రామసుబ్బారెడ్డి. చేజర్ల రవి. నరసయ్య. భాష. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు,