మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 9 :నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న 303 అభివృద్ధి పనులలో భాగంగా 32 మరియు 33 డివిజన్ లలో అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ........303 అభివృద్ధి పనులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నేను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.303 అభివృద్ధి పనుల్లో స్థానిక ప్రజలు వారి సొంత పనులలా భావించి భాగస్వామ్యం అయినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు సహకరిస్తున్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు కి, ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కి, యువ నాయకులు,రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ కి, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకి కలెక్టర్ మరియు కమిషనర్ కి, అధికార యంత్రాంగానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ లు, కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.