మన న్యూస్ శంఖవరం (అపురూప్) కాకినాడ జిల్లా శంఖవరం మండలం జి. కొత్తపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగా చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్ళు దగ్ధమయ్యాయి .. ఈ అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన గొనగాల పార్వతి , పల్లా లోవతల్లిల కుటుంబాలు సర్వం కోల్పోవటంతో వారి కుటుంబాలను ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి శ్రేణులు మంగళవారం వారి కుటుంబాలను పరామర్శించారు. అగ్నిప్రమాదం సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని కూటమి నాయకులు వారికి భరోసా ఇచ్చారు..బాధితు కుటుంబాలకు బియ్యం, నిత్యవసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేశారు.. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బద్ది మణి రామారావు, రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ), టిడిపి సీనియర్ నాయకులు పర్వత సురేష్,నియోజవర్గ జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి సింగిలి దేవి సత్తిరాజు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సీబీఎన్ అధ్యక్షులు మరియు నియోజవర్గ పొలిటికల్ అడ్మినిస్ట్రేటర్ యాళ్ళ జగదీశ్ పెంటకోట మోహన్, నియోజవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి వెంకట సుభాష్, దాసం శేషారావు, బద్ది వెంకటరమణ,ఈగల దేవుడు, కర్ణం సుబ్రమణ్యం, మేకల కృష్ణ, శంఖవరం పార్టీ కార్యదర్శి ఉల్లి వీరభద్రరావు, కాకినాడ పార్లమెంట్ టిడిపి కార్యదర్శి సర్నం గోవిందు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…