మన న్యూస్ పాచిపెంట ఏప్రిల్ 8:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఏర్పడి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆశా వర్కర్లు సిహెచ్ డబ్ల్యూ సాధించిన విజయాలు ఎదుర్కొంటున్న సవాళ్లు పైన జిల్లా సదస్సు జరుగుతుందని ఈ సదస్సుకు ఆశ వర్కర్స్ మరియు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కదలి రావాలని ఆశా వర్కర్స్ యూనియన్ గురు నాయుడు పేట పాచిపెంట పీహెచ్సీ నాయకులు పి నాగవేణి నిర్మల. జి మంజుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సదస్సు విజయవంతం కోసం ఈనెల 15వ తేదీన ఏప్రిల్ 15 ఉదయం 10 గంటలకు పార్వతీపురం చర్చి సెంటర్ వద్ద కళ్యాణ మండపం వద్ద జరుగుతుందని ఈ కార్యక్రమానికి ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ధనలక్ష్మి శ్రామిక మహిళ అధ్యక్షులు ఆస వర్కర్స్ యూనియన్ నాయకులు వి. ఇందిరా. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై మన్మధరావు. అధ్యక్షులు రమణారావు గౌరీశ్వరి శివాని పాల్గొంటారు మన ఆశ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు అందరు కూడా కదిలి సదస్సును విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా. సిఐటియు నాయకులు. కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ ఆశా వర్కర్లు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు అనేక పోరాటాల ఫలితంగా ఎన్నో హక్కులు సాధించుకున్నారని ఇంకా యూనియన్ నిర్ణయించిన కర్తవ్యాలను పూర్తిస్థాయిలో అమలు చేసి భవిష్యత్తులో ప్రభుత్వం మన సమస్యలు పరిష్కారం చేసే వరకు ఐక్యంగా యూనియన్ పరంగా పోరాడాలని. 400 నుండి 4000 వరకు గౌరవ వేతనం పెంచుకున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను అభినందించారు అలాగే నాలుగు వందలు పారితోషంగా ఉన్నటువంటి ఆశ వర్కర్లకు వేతనం 10000 వరకు పెంచుకున్న సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు భవిష్యత్తులో కమ్యూనిటీ హెల్త్ వర్కర్ ని ఆశలుగా మార్చి కనీస వేతనాలు సమాన పనికి సమాన వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సదస్సులో అనేక కర్తవ్యాలు రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమముకి ఆశ వర్కర్లు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు హాజరయ్యారు. పాచిపెంట గురువు నాయుడుపేట పిహెచ్సి ల వద్ద మాట్లాడుతున్న సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు.