మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో పోషణ పక్షోత్సవాలు సక్రమంగా నిర్వహించాలని పాచిపెంట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిణి బి అనంతలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు.మంగళవారం నాడు పాచిపెంట వెలుగు భవనం లో అంగన్వాడీ కార్యకర్తలు అందరికి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. పోషణ పక్షోత్సవాలు మంగళవారం నుండి ఈ నెల 22 వ తేదీ వరకు పౌస్టికాహర పక్షోత్సవం అంగన్వాడీ కేంద్రం స్థాయి లో రోజు వారి చెయ్యవలసిన కార్యక్రమాలు గురించి పిఓ తెలియజేశారు. ముఖ్యమైన అంశాలు ఒక్కొక్కటిగా వివరించారు.మొదటి 1000రోజులు గర్భధారణ మొదలుకొని 2సంవత్సరాల వయస్సు వరకు ప్రాముఖ్యత గురించి తెలియజేశారు.పోషణ మరియు సంరక్షణ గురించి వివరించారు.బరువు తక్కువ పిల్లలును గుర్తించి -సంరక్షణ చర్యలు గురించి తల్లులు కి తెలియచేయుట జరిగిందని తెలిపారు.అంగన్వాడీ కేంద్రం లో లబ్ధిదారులు స్వయం గా నమోదు చేసుకొనుటకు అవగాహన కల్పించారు.పిల్లలు లో ఆరోగ్య కరమైన జీవన శైలి మరియు ఆహార పద్ధతులు అలవాటు చేసుకునేలా తల్లులు లకు వివరించారు.అవగాహనా కార్యక్రమలు అంగన్వాడీ కార్యకర్తలు కు తెలియచేసిన తర్వాత నినాదాల తో ర్యాలీ చెయ్యడం జరిగింది. పై కార్యక్రమానికి సూపర్వైజర్లు, ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.