మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు,వుదయం దినపత్రిక జర్నలిస్టు గుర్రపు వెంకటేశంను సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు వారి స్వగ్రామం మాగికి వెళ్ళి వారి నివాసంలో పరామర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేశంకు కాలు విరగడంతో ఆయనను పరామర్శించిన ఎమ్మెల్యే మనోధైర్యాన్నిచ్చారు.దీంతో పాటు వైధ్యుల సలహాలు, సూచనలు పాటించి త్వరగా ఆరోగ్యవంతునిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మెన్ చీకోటి మనోజ్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,కాంగ్రెస్ నాయకులు గుర్రపు శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి,రాజారాం,పండరి, సంతోష్‌రాథోడ్,అనీస్,తదితరులు పాల్గొన్నారు.