మనన్యూస్,కొత్తపేట:ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్లోని
మోహన్ నగర్ శృంగేరి కాలనీ లోని బంగారు మైసమ్మ ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.అనంతరం నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో సుమారు 2000 మందికి పైగా భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి సీతారాముల కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు.భక్తులందరికీ శ్రీరామననవమి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో వజీరు సుజిత్ గౌడ్,వజీర్ గోపి గౌడ్,వగ్గుల సత్యనారాయణ, సట్టు చందు,తదితరులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.