మనన్యూస్,దిల్సుఖ్నగర్:శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాదు వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దిల్సుఖ్నగర్ శాలివాహన నగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర పంచాయతీల దేవస్థానం లో భక్తులకు బట్టర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ చేశారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిధిగా శ్రీనివాస్ బాశెట్టి హాజరయ్యారు. ఇట్టి కార్యక్రమంకు తమకు సహకరించిన శేరి వెంకటేష్ కి హైదరాబాదు వైశ్య యూత్ అసోసియేషన్ తరపున తన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దేవేందర్ సముద్రాల, జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్ దైత , ట్రెజరర్ వంశీ జిల్లా,ప్రాజెక్టు టీం ఉదయ్ భాస్కర్ సరాబు, కార్తీక్ అమరధి , విష్ణు నార్ల, రాజలింగం, అర్జున్, పి ఎస్టి లు నరేష్ నాగార్జున్,,తదితరులు పాల్గొన్నారు.