మనన్యూస్,గొల్లప్రోలు:పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బలి రెడ్డి గంగబాబు పరిశీలించారు.క్యాంటిన్ పరిసరాలు శుభ్రంగా ఉండటం గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు.పేద ప్రజలకు అందిస్తున్న క్యాంటీన్ మెనూ ను పరిశీలించి రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.ఇడ్లి పూరి దోస తదితర ఆహార పదార్థాలు బాగున్నాయని, బలి రెడ్డి గంగబాబు తెలిపారు.ఎమ్మల్సి నాగబాబు అన్నా క్యాంటీన్ ఏర్పాటు లో ప్రత్యేక శ్రద్ద చూపారని, తెలిపారు.డిప్యూటి సిఎం కు అప్రతిష్ట తెచ్చేలా సిబ్బంది వ్యవహరిస్తే సంహించేది లేదని, ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు మించి వసూలు చేయరాదని తెలిపారు.అలాగే క్యాంటీన్ కొచ్చే వారిపట్ల ఏమాత్రం దురుసుగా ప్రవర్తించ రాదని నిర్వాహకులను కోరారు.గంగబాబు వెంట పలువురు బిసి నాయకులు,జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.