మన న్యూస్: నియోజకవర్గ కార్యదర్శి అక్కెనపల్లి నాగేంద్రబాబు పినపాక నియోజకవర్గం, ఆశ్వాపురం మండలం, విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ ను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి, శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కి, వినతిపత్రం అందజేసి వారితో మాట్లాడుతూ, అశ్వాపురం మండలంలో జూనియర్ కళాశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, అలాగే,బీసీ హాస్టల్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, అలాగే నెల్లిపాక బంజర ప్రభుత్వ ఉన్నత పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, ఖాళీగా ఉన్న పి ఈ టి ఉపాధ్యాయులను నియమించాలని, అశ్వాపురం మండలం ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఆట స్థలం కేటాయించాలని వారిని కోరారు, శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కి, సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు వారు సానుకూలంగా ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో
ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు,
రామ్, రమేష్, రఘు, వెంకట్, వినోద్, రామకృష్ణ, విష్ణు, తదితరులు పాల్గొన్నారు..