మనన్యూస్,నెల్లూరు:నియోజకవర్గంలోని అమంచర్ల గ్రామ పంచాయతీ, అప్పయకండ్రిగ గ్రామంలో కర్మక్రతువుల భవన నిర్మాణ పనులకు సోమవారం ఉదయం శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ
అప్పయకండ్రిగ గ్రామంలో ఇప్పటికీ చాలా అభివృద్ధి చేయడం జరిగింది. రాబోవు రోజుల్లో మరింత అభివృద్ధికి కృషి చేస్తాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గ్రామస్థులు మరికొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని కూడా సాధ్యమైనంత త్వరలో నిధులు ఏర్పాటు చేసి పనులు ప్రారంభిస్తాం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల్లూరు రూరల్ లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.ఇందుకు సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి నా ప్రత్యేక ధన్యవాదాలు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో అమంచర్ల సర్పంచ్ రమణమ్మ, ఉప సర్పంచ్ మల్లినేని వేణు నాయుడు, టిడిపి నాయకులు వాక వెంకటేశ్వర్లు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు అల్లాబక్షు, సాగినీటి సంఘం చైర్మన్లు నెట్టెం చిరంజీవి నాయుడు, గుడి రఘురామయ్య, టిడిపి నాయకులు దాసరి అశోక్, గుడి మస్తానయ్య, నంబూరు వెంకటరమణమ్మ తదితరులు పాల్గొన్నారు.