మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని
బూరెడ్డి పల్లి గ్రామాలలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం పురస్కరించుకుని గ్రామంలో ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు శ్రీమతి శ్రీ బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, మాజీ కౌన్సిలర్ మురళి, నాయకులు చంద్రశేఖర్, గ్రామ పెద్దలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .