అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ఆర్ఐ
విద్యార్థి ఇల్లా నవీన్
మనన్యూస్,పినపాక:మండలంలోని గోపాలరావు పేట గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలు నడుమ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామ నామంతో భక్తులు పరవశించారు. కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన ఏడూల్ల బయ్యారం ఎస్ఐ ఇమ్మడి రాజ్ కుమార్ కు ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికి సాలువాతో సత్కరించారు. సీతారాములను దర్శించుకున్న రాజ్ కుమార్ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.వారు మాట్లాడుతూ మండల ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. గోపాలరావు పేట గ్రామంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామివారి కల్యాణ వేడుకలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీని అభినందించారు. భక్తులకు రుచికరమైన అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించిన ఎన్ఆర్ఐ విద్యార్థి ఇల్ల నవీన్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కూనరపు సత్యనారాయణ, బుస్సీ శ్రీనివాస్, కటకం గణేష్, బొలిశెట్టి ప్రభాకర్, ఉడుగుల రామచంద్రు, గాడుదుల కృష్ణ, కొంపెల్లినాగేశ్వరరావు, అనుపెద్ది బాబురావు, కేప సతీష్, మార్త మనోజ్, అంకతి సమ్మయ్య, పాత్రికేయులు కొంపెల్లి సంతోష్, కన్నె రమేష్ గాడుదులు దిలీప్, తదితరులు పాల్గొన్నారు.