మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా,
అలంపూర్ నియోజకవర్గం.. మానవపాడు మండల కేంద్రంలోని, శ్రీ మాధవ ఆంజనేయ స్వామి దేవాలయం నందు సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవమును తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అశేష భక్తుల మధ్య, మంగళ వాయిద్యాలతో అర్చకుల విశేష పూజలతో స్వామివారి కళ్యాణం వైభవంగా ఆదివారం జరిగింది. ఈ వేడుకలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి కల్యాణము వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి పట్టువస్తాలను కమిటీ సభ్యులు అందించారు.సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులకు తన తండ్రి కీర్తిశేషులు రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ M.నాగేంద్రన్న గారి జ్ఞాపకార్థంగా అన్నదానం కార్యక్రమాన్ని వారి కుమారుడు పోలీస్ నాగరాజు మరియు వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవము ఆహ్వాన పత్రికను గ్రామములోని ఇంటింటికి పంపిణీ చేసి అందరినీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మానవపాడు రైతు సంఘం మరియు గ్రామ ప్రజల సహకారంతో కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తదితరులు అధిక సంఖ్యలో జరిగింది.