మనన్యూస్,నాగోల్:ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్లోని మమతా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సీతా రాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.అనంతరం నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో సుమారు 3000 మందికి పైగా భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా మమతా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్నామని, పంచలోహ విగ్రహాలు ప్రతిష్టించడం ఇక్కడ ప్రత్యేకత అన్నారు.ఈ కార్యక్రమంలో మమతా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం శ్రీధర్, వైస్ ప్రెసిడెంట్ డి ప్రభావతి, జనరల్ సెక్రటరీ కె సురేఖ, ట్రెజరర్ ఏ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ కె కార్తీక్ రాయలు, కల్చరల్ సెక్రటరీ జి రామ్మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టి మహేష్, కన్యాదాన స్పాన్సర్ ప్రకాష్, తదితరులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.