మనన్యూస్,కోవూరు:శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
కోవూరు నియోజకవర్గ ప్రజానీకానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆమె నియోజకవర్గ పరిధిలోని పడుగుపాడు, రాజుపాళెం, జమ్మిపాళెం గ్రామాలలోని రామాలయాలను సందర్శించి రాముల వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు. కోవూరు నియోజకవర్గం పాడి పంటలు పరిశ్రమలతో అభివృద్ధి చెందాలని ప్రార్ధించారు. ఎంతటి విషమ పరిస్థితుల్లోనైనా సత్యం, ధర్మానికి కట్టుబడి ఉండాలన్న సందేశాన్ని శ్రీరాముని జీవితం మనకు అందిస్తుందన్నారు. \శ్రీరాముడు ఆచరించి చూపిన జీవన ప్రమాణాలు మనకు ప్రతి దశలోనూ స్ఫూర్తినిస్తాయని ఆమె తెలిపారు. సీతారాముల ఆదర్శ జీవితం భారతీయ కుటుంబ ఔన్నత్యాన్ని చాటుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, అడపాల శ్రీధర్ రెడ్డి, DCN శ్రీనివాసులు, ఇరువూరు శ్రీధర్ రెడ్డి, గాదిరాజు అశోక్, కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, కరేటి శీను, గుత్తికొండ వెంకయ్య, పెంచలయ్య, పురుషోత్తం, కరేటి అమరావతి, రాకి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.