మనన్యూస్,నెల్లూరు:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో 53 డివిజన్ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండేటి వెంగళ్ రెడ్డిని 53 వ డివిజన్ వైసిపి ఇన్ చార్జ్ గా ప్రకటించారు.
ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.వెంగళ్ రెడ్డి తో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా తామంత సేవలందిస్తామని డివిజన్ ప్రజలు తెలియజేశారు.ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు.
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రజాగ్రహానికి లోనయ్యాడని..తెలిపారు.
ప్రజల్లో మార్పు వచ్చిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్లీ మంచి రోజులు వస్తాయని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని తెలిపారు .ఈ రాష్ట్రానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితేనే ప్రజల కష్టాలు తీరుతాయన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా వినిపిస్తుందన్నారు.పార్టీకి కష్ట కాలంలో సేవలందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని తెలిపారు.
డివిజన్ ప్రజలతో చర్చించిన తర్వాత వెంగల్ రెడ్డి ని 53వ డివిజన్ ఇంచార్జిగా.. ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.
డివిజన్ ప్రజలు సమన్వయంతో పనిచేసి మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నీలి రాఘవరావు , 11 వ డివిజన్ ఇంచార్జ్ మహేష్ స్థానిక 53 వ డివిజన్ నేతలు బ్రహ్మారెడ్డి, నాగరాజు, విజయ , నిర్మల , వెంకట రమణమ్మ , తిరుపతయ్య గారు, హజరతయ్య , ప్రసన్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పాల్గొన్నారు.