మనన్యూస్:శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం స్థానిక తూకివాకంలోని ఆశ్రయ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే వృద్ధులు ప్రత్యేక ప్రతిభావంతుల కేంద్రంలో టీటీడీ క్షత్రియ ఉద్యోగుల సంఘం, తిరుపతి లోని రాజు క్షత్రియులు కలసి సీతా సమేత శ్రీరాముల చిత్రపటాన్ని ఉంచి పూజలు నిర్వహించారు. ఉదయం మంచిని పెంచు ఆర్గనైజేషన్ ద్వారా అల్పాహారం అందజేశారు. అనంతరం క్షత్రియ రాజులచే ఒక నెలకు సరిపడే ఆహార ధాన్యాలను, నూనె,పప్పు దినుసులు, పండ్లు, బిస్కెట్లు తదితర వస్తువులను ఆశ్రయ నిర్వాహకురాలు శోభారాణి, రమేష్, శంకర్ రెడ్డి గౌతమ్ లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రుక్మాంగదరాజు, బాలరాజు, సుబ్రహ్మణ్యం రాజు, శ్రీధర్ రాజు, రామ్మూర్తి రాజు, మధు శేఖర్ రాజు,సుకుమార్ రాజు, మాధవ రాజు, రుద్రరాజు చరణ్ రాజు, ముని భాస్కర్ రాజు, గోవర్ధన రాజు, రామకృష్ణమ్మ రాజు, వెంకట మునిరాజు, సిరిగిరి శంకరరాజు, భాస్కర్ రాజు, లక్ష్మి, రేవతి, వన్నూరు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.