మనన్యూస్,నెల్లూరు:రూ.3 లక్షల చెక్కు అందజేసిన వేమిరెడ్డి దంపతులు
నెల్లూరులోని ప్రగతి ఛారిటీస్ సంస్థకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విరాళం అందించి తమ ఔదార్యం చాటుకున్నారు. ప్రగతి ఛారిటీస్ సంస్థకు రూ.3 లక్షల విరాళం అందించి ఆదుకున్నారు. ఆదివారం ఛారిటీస్ ప్రతినిధులు పలువురు చిన్నారులతో కలిసి నెల్లూరులోని వి.పి.ఆర్ నివాసంలో ఈ చెక్కును అందుకున్నారు. అనంతరం చిన్నారులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కి గులాబీ పువ్వులు అందించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. 2012 నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఏటా ప్రగతి ఛారిటీస్ నిర్వహణకు రూ.3 లక్షలు అందిస్తున్నారు. ప్రగతి ఛారిటీస్ సంస్థ ద్వారా నెల్లూరులో మూగ, చెముడు చిన్నారులకు చదువు అందుతోంది. అలాగే మెంటల్లీ డిజేబుల్డ్ చిన్నారుల బాగోగులు చూసుకుంటున్నట్లు ప్రతినిధులు చెప్పారు. అలాంటి చిన్నారులకు వి.పి.ఆర్ దంపతుల ఔదార్యం మరువలేనిదని వారు తెలిపారు.