మన న్యూస్ : శేరిలింగంపల్లి (నవంబర్ 14)
మియాపూర్ డివిజన్ నాగార్జున ఎన్క్లేవ్ లో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మియాపూర్ డివిజన్ కార్పోరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కుటుంబ వివరాలను డిసి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్యునరేటర్ కుటుంబ సర్వే వివరాలను సెకరించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజలకు సమగ్ర కుటుంబ సర్వే ఎంతగానో దోహదం చేస్తుందన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.ఈ సర్వే వలన నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని అర్హులైన పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ప్రజలందరూ సామాజిక కుటుంబ సర్వేకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు వైద్య అధికారి రవి , శానిటేషన్ సూపర్ వైజర్ శ్రీనివాస్ ఏస్ ఆర్ పి, కనకరాజు ఎస్ఎఫ్ఐ లు వినయ్ , అగమ్య తదితరులు పాల్గొన్నారు.